ఆ వివరాలు మేమివ్వం.. కేంద్రం నుంచే తీస్కోండి

ఆ వివరాలు మేమివ్వం.. కేంద్రం నుంచే తీస్కోండి
  • తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీకి తేల్చి చెప్పిన జీఆర్ఎంబీ 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ మరోసారి కపట నాటకాలకు తెరతీసింది. గోదావరి నదిపై మన ప్రాజెక్టుల వివరాలు కావాలంటూ గోదావరి రివర్​మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​బోర్డుకు ఇటీవల లేఖ రాసింది.  940 టీఎంసీల నికర జలాల ప్రాజెక్టులకు అనుమతులున్నాయంటూ తెలంగాణ చెప్పుకుంటున్నదని, ఆ ప్రాజెక్టుల డేటా కావాలని అడుగుతున్నది. 
జీఆర్ఎంబీ 16వ బోర్డు మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ వినిపించిన వాదనల వివరాలూ కావాలని  లేఖ రాసింది.

ఆ లేఖకు బోర్డు రిప్లై ఇచ్చింది. ఆ వివరాలను తాము ఇవ్వలేమని ఏపీకి తేల్చి చెప్పింది. రెండు రాష్ట్రాల జల వివాదాలను పరిష్కరించేందుకు ఇప్పటికే సీడబ్ల్యూసీ చైర్మన్​ నేతృత్వంలో హైపవర్​ కమిటీ వేశారని, వివరాలు కావాలని ఆ కమిటీనే అడగాలని స్పష్టం చేసింది. ఎలాగూ ఈ నెల 30న మీటింగ్​నిర్వహిస్తున్నారు కాబట్టి.. మీటింగ్​ఎజెండాలో ఏపీ డిమాండ్లనూ పెట్టొచ్చని  సూచించింది.