హైదరాబాద్, వెలుగు : పేపర్ లీకేజీలతో రద్దయిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు రీ–ఎగ్జామ్‌కు సంబంధించి ఆదివారం నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. నిరుడు అక్టోబర్‌లో నిర్వహించిన పరీక్షకు కేటాయించిన హాల్ టికెట్లు చెల్లవని, కొత్తవి డౌన్లోడ్ చేసుకోవాలని శనివారం ఓ ప్రకటనలో అభ్యర్థులకు సూచించింది.
చివరి నిమిషంలో కాకుండా ముందుగానే హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొంది. ఈనెల 11న ఉదయం 10.30 గంల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనుంది. కాగా, నిరుడు అక్టోబర్ 16న నిర్వహించిన పరీక్షకు సంబంధించి పేపర్‌లీక్ కావడంతో.. ఆ ఎగ్జామ్‌ను ఈ ఏడాది మార్చి 17న టీఎస్పీఎస్సీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. జూన్ 11న పరీక్ష నిర్వహిస్తామని ఆ రోజే ప్రకటించింది.
