గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు 66.16%మంది హాజరు.. సిద్ధిపేటలో ఓ అభ్యర్థి అరెస్టు!

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు 66.16%మంది హాజరు.. సిద్ధిపేటలో ఓ అభ్యర్థి అరెస్టు!

తెలంగాణ గ్రూప్1 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు 61.37%  మంది అభ్యర్థులు హాజరైనట్టు TSPSC  అధికారులు వెల్లడించారు.   మొత్తం 503 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకోసం నిర్వహించిన ఈ పరీక్షకు 3 లక్షల 80 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా రాష్ట్ర వ్యాప్తంగా  2,32,457 మంది అభ్యర్థులు పరీక్ష రాసినట్టు తెలిపారు. 

అయితే పేపర్ లీకేజీ కారణంగా 2023 అక్టోబర్‌ 16న జరిగిన గ్రూప్‌ 1 పరీక్షను TSPSC  రద్దు చేసిన సంగతి తెలిసిందే.  గతంతో పోలిస్తే ఈ సారి భారీగా  గ్రూప్ వన్ రాసిన అభ్యర్థుల హాజరు శాతం తగ్గింది.  అక్టోబర్ 16 జరిగిన గ్రూప్ వన్ పరీక్షకు   2 లక్షల 86 వేల 51 ( 75%) మంది అభ్యర్థులు హాజరయ్యారు.  గతంలో జరిగిన లోటుపాట్లు, గందరగోళం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.  

సిద్దిపేటలో గ్రూప్ 1 అభ్యర్థి నిర్వాకం

సిద్దిపేటలో పరీక్ష ప్రారంభానికి ముందే కేంద్రం నుంచి ప్రశాంత్‌ అనే అభ్యర్థి బయటకు వచ్చాడు. ఓఎంఆర్‌ షీట్‌లో హాల్‌టికెట్‌ నంబర్‌ తప్పుగా రాశాడు. దీంతో పరీక్ష రాసినా వృథా అని భావించి బయటకు వచ్చేశాడు. పరీక్ష కేంద్ర బయటకు రాగానే అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రశాంత్‌పై మాల్‌ ప్రాక్టీసు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.