FIFA World Cup 2026: చరిత్ర సృష్టించిన పరాగ్వే ప్లేయర్.. టర్కీపై ఫాస్టెట్ గోల్ కొట్టి రికార్డు

FIFA World Cup 2026: చరిత్ర సృష్టించిన పరాగ్వే ప్లేయర్.. టర్కీపై ఫాస్టెట్ గోల్ కొట్టి రికార్డు

ఫిఫా వరల్డ్ కప్ 2026లో రికార్డులు  బ్రేకవుతున్నాయి. సంచనాలు నమోదవుతున్నాయి. ఫుట్ బాల్ ఫ్యాన్స్ కు ఒక్కో మ్యాచ్ ఒక్కో రకంగా ఉర్రూతలూగించే కిక్ ఇస్తున్నాయి. శనివారం (జూన్ 20)  టర్కీతో జరిగిన గ్రూప్ డి మ్యాచ్ లో పరాగ్వే ప్లేయర్ మాటియాస్ గలార్జా ఫాస్టెస్ట్ గోల్ కొట్టి రికార్డు సృష్టించాడు. 

మాటియాస్ గలార్జా, ఫీఫా ప్రపంచ కప్ 2026లో  ఫాస్టెస్ట్ గోల్ చేసి చరిత్ర సృష్టించాడు. కేవలం 65 సెకన్లలోనే గలార్జా అద్భుతమైన లాంగ్-రేంజ్ షాట్‌తో గోల్ చేసి పరాగ్వేకు ఆధిక్యం అందించాడు. అంతకుముందు రోజు, మొరాకోకు ప్లేయర్ ఇస్మాయెల్ సైబారి  స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 72 సెకన్లలో గోల్ చేసి ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇవాళ గలార్జా ఆ రికార్డును బ్రేక్ చేశాడు. 

ఇక ఫిఫా వరల్డ్ కప్ హిస్టరీ మొత్తంలో.. ఆల్ టైమ్ ఫాస్టెస్ట్ గోల్ రికార్డు టర్కీకి చెందిన హకాన్ సుకుర్ పేరుమీద ఉంది. 2002 టోర్నమెంట్‌లో దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో, ఆట మొదలైన కేవలం 10.8 సెకన్లకే గోల్ చేసి చరిత్ర సృష్టించాడు.