ఖమ్మం టౌన్, వెలుగు: ఆన్లైన్ లో నకిలీ పత్రాలు, ఎంవోయూ పేరుతో విద్యార్థులకు ట్రైనింగ్స్ ఇస్తామని నమ్మించి రూ.10 లక్షలు కాజేసిన కేసులో నిందితుడిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణిందర్ తెలిపారు. శుక్రవారం డీఎస్పీ ఆఫీస్లో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ విద్యా సంస్థకు వాట్సాప్ లో ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ గా పరిచయం చేసుకొని, కాలేజీ విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి నకిలీ డాక్యుమెంట్స్, నకిలీ ఎంఓయూను ఆన్లైన్ లో పంపించి డి.రవి కిరణ్(26) కాజేశాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ తెలిపారు.
