జమ్మికుంట, వెలుగు: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం బోగంపాడు గ్రామంలో వర్షాల కోసం హనుమాన్ దేవాలయంతో పాటు గ్రామ దేవతలు మహాలక్ష్మి, భూలక్ష్మి, బొడ్రాయి, పెద్దమ్మతల్లికి గ్రామస్తులు జలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఏలేటి నిర్మల మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణ దేవుడిని వేడుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇంద్రారెడ్డి, సొసైటీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
