వచ్చే నెల 1న గ్రూప్ 4 ఎగ్జామ్..అటెండ్ కానున్న 9.51 లక్షల మంది

వచ్చే నెల 1న  గ్రూప్ 4 ఎగ్జామ్..అటెండ్ కానున్న 9.51 లక్షల మంది

 

  • ఇవ్వాలో రేపో వెబ్ సైట్​లో హాల్ టికెట్లు 
  • రాష్ట్రవ్యాప్తంగా 2,846 సెంటర్లు 
  • పరీక్షా కేంద్రాలున్న విద్యాసంస్థలకు సెలవులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చేనెల 1న జరిగే  గ్రూప్–4 పరీక్ష నిర్వహణకు టీఎస్​పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పరీక్షలను నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్షా కేంద్రాలున్న స్కూళ్లు, కాలేజీలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలో 8,180 గ్రూప్–4 పోస్టుల భర్తీకి జులై 1న టీఎస్​పీఎస్సీ రాతపరీక్ష నిర్వహించనున్నది. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపర్–2 పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షకు మొత్తం 9,51,321 మంది అప్లై చేశారు. 

నిర్వహణకు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 2,846 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్​లోనే ఎక్కువగా సెంటర్లున్నాయి. కాగా, పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఒకట్రెండు రోజుల్లో టీఎస్​పీఎస్సీ వెబ్ సైట్​లో పెట్టనున్నారు. పరీక్షల నిర్వహణకు టీఎస్​పీఎస్సీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లతో టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సమీక్షలు నిర్వహించారు. పరీక్షల పర్యవేక్షణకు 40వేల మంది ఇన్విజిలేటర్లను నియమించగా, ఇంకో 10 వేల మంది ఇతర సిబ్బందిని ఏర్పాటు చేశారు. పరీక్షల్లో అభ్యర్థుల ఐడెంటీఫై కోసం కొత్త విధానం తెస్తు న్నట్టు అధికారులు చెప్తున్నారు. ముందుగా గ్రూప్–4 ద్వారా 9,168 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించి, నోటిఫికేషన్​లో 8,039 పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. చివరికి బీసీ గురుకులాల్లో 141 పోస్టులు యాడ్ చేయడంతో మొత్తం పోస్టుల సంఖ్య 8,180కి చేరింది.