కేంద్రంపై అవాస్తవాలను ప్రచారం చేస్తే ఊరుకోం

కేంద్రంపై అవాస్తవాలను ప్రచారం చేస్తే ఊరుకోం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు కావాలనే అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని సెంట్రల్ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. ప్రభుత్వ ఇమేజ్‌ను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వారిని దీటుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంపై ప్రచారమయ్యే కథనాలు, అవాస్తవాలను ఎలా ఎదుర్కోవాలనే విషయంపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం) మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌‌లో కేంద్ర మంత్రులు రవి శంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ, ప్రకాశ్ జవదేకర్, ఎస్.జైశంకర్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కిరణ్ రిజిజు, హర్దీప్ సింగ్ పురితోపాటు అనురాగ్ ఠాకూర్, బాబుల్ సుప్రియో పాల్గొన్నారు.

మీటింగ్‌‌లో పాల్గొన్న రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వైస్ ఛాన్స్‌‌లర్లు, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్లు, రిటైర్డ్ ఐఎఫ్‌‌ఎస్ ఆఫీసర్లు కేంద్ర ప్రభుత్వ కృషి, విజయాలను గుర్తించి ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. దేశంతోపాటు, గ్లోబల్‌‌గా భారత్ సాధిస్తున్న ఘనతలను అందరికీ తెలియజేయాలని సూచించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు, వార్తలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే వారిని తటస్థీకరించాల్సిన ఆవశ్యకత ఉందని నఖ్వీ చెప్పారు.