కొండముచ్చులను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు

కొండముచ్చులను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు

మహారాష్ట్రలోని బీడ్ ఏరియాలో కోతులు, కొండముచ్చులతో కుక్కలకు కొద్ది రోజులుగా గ్యాంగ్ వార్ నడుస్తోంది. ఇది 250 కి పైగా కుక్క పిల్లల ప్రాణాలు పోవడానికి కారణమైంది. బీడ్ జిల్లాలోని మజల్ గావ్ లో కొద్ది రోజుల క్రితం కొన్ని కుక్కలు ఓ కోతి పిల్లను చంపేశాయి. ఈ విషయాన్ని మిగతా కోతులు గమనించాయి. అప్పటి నుంచి కుక్కలపై పగబట్టాయి. కుక్క పిల్లలు కనిపిస్తే.. వాటిని తీసుకెళ్లి చెట్లు, పెద్ద బిల్డింగులపై నుంచి కిందకు విసిరేసి చంపుతున్నాయి. ఇలా మూడు నెలల్లో దాదాపు 250 కుక్కపిల్లలను చంపేశాయి. ప్రస్తుతం ఊరిలో ఒక్క కుక్క కూడా లేకుండా పోయాయని గ్రామస్తులు చెబుతున్నారు. కోతులు, కొండముచ్చుల దాడులు పెరిగిపోవడంతో.. ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మజల్ గావ్ కు వచ్చిన అధికారులు రెండు కొండముచ్చులను పట్టుకున్నారు.

మరిన్ని వార్తల కోసం

కేసీఆర్ కు కొత్త నిర్వచనం చెప్పిన విజయశాంతి

బెంగాల్ ఫార్ములా ఇక్కడ పనిచేయదు