హైదరాబాద్, వెలుగు : పంప్ సొల్యూషన్స్, వాటర్ టెక్నాలజీ కంపెనీ గ్రాండ్‌ఫోస్ హైదరాబాద్లో గురువారం నిర్వహించిన ఎండ్-యూజర్ ఫెయిర్ 2024లో పంపింగ్ సొల్యూషన్లను ఆవిష్కరించింది. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ (జెడ్ ఎల్ డీ) అప్లికేషన్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సొల్యూషన్లు ఇందులో ఉంటాయి. పరిశ్రమలు ఇంధనాన్ని పొదుపు చేయడం, నికర-సున్నా ఉద్గారాల లక్ష్యాలను సాధించడంలో సహాయపడటానికి రూపొందించిన అత్యాధునిక ఈ -సొల్యూషన్లను సంస్థ ప్రదర్శించింది.
ఈ కార్యక్రమంలో వివిధ పరిశ్రమల రంగాల నుంచి 200 మందికి పైగా కస్టమర్లు పాల్గొన్నారు. ఇంటరాక్టివ్ ప్రదర్శనలు, నిపుణుల ప్యానెల్ చర్చలు, నెట్‌వర్కింగ్ కార్యక్రమాలను కూడా నిర్వహించామని గ్రాండ్ఫోస్తెలిపింది.