జీఎస్టీ రేట్లలో మార్పు.. సిమెంట్ బస్తా ధర 35 రూపాయల దాకా డౌన్‌

జీఎస్టీ రేట్లలో మార్పు.. సిమెంట్ బస్తా ధర 35 రూపాయల దాకా డౌన్‌

న్యూఢిల్లీ: జీఎస్టీ రేట్లలో మార్పు వల్ల సిమెంట్ ధరలు బస్తాపై రూ. 30 నుంచి రూ. 35 వరకు తగ్గుతాయని, దీనివల్ల నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్-రా) నివేదిక తెలిపింది. జీఎస్టీ కౌన్సిల్ సిమెంట్​పై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. కొత్త రేట్లు ఈ నెల 22 నుంచి వర్తిస్తాయి.

ఈ తగ్గింపు సిమెంట్ రంగానికి సానుకూలమని, గృహ నిర్మాణ రంగంలో డిమాండ్‌‌‌‌ను పెంచుతుందని నివేదిక పేర్కొంది. కంపెనీలు ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందిస్తాయని ఇండ్-రా అభిప్రాయపడింది. దీనివల్ల మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణ ప్రాజెక్టుల ఖర్చు తగ్గుతుంది.  డిమాండ్‌‌‌‌ భారీగా పెరగకపోవచ్చని, వృద్ధి అంచనా 5–-7 శాతంగా ఉండొచ్చని తెలిపింది.  2026 ఆర్థిక సంవత్సరంలో రెండో క్వార్టర్​లో సిమెంట్ డిమాండ్ మందగిస్తుందని పేర్కొంది.