హైదరాబాద్‎లో దారుణం: బాలసదన్‎లో ఐదుగురు బాలురపై స్టాఫ్ గార్డ్ లైంగిక దాడి

హైదరాబాద్‎లో దారుణం: బాలసదన్‎లో ఐదుగురు బాలురపై స్టాఫ్ గార్డ్ లైంగిక దాడి

హైదరాబాద్: హైదరాబాద్‎లో దారుణ ఘటన వెలుగు చూసింది. బాలసదన్‎లో ఉంటున్న మగ పిల్లలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు స్టాఫ్ గార్డ్. ఓ బాలుడు అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించగా ఈ నీచమైన ఘటన బయటపడింది.

వివరాల ప్రకారం.. సైదాబాద్‎లోని బాలసదన్‎ హోమ్‎లో ఓ బాలుడుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు స్టాప్ గార్డ్. అనంతరం బాలుడిని బలవంతంగా ఇంటికి పంపించేశాడు. ఇంటికి వెళ్లిన బాలుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు గుర్తించారు. 

ఈ విషయంపై బాలసదన్ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు బాలుడి పేరెంట్స్. వెంటనే అప్రమత్తమైన బాలసదన్ నిర్వాహకులు సదరు స్టాఫ్ గార్డ్‎పై పోలీసులకు కంప్లైంట్ చేశారు. బాలసదన్ ఫిర్యాదు మేరకు స్టాఫ్ గార్డ్‎ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలసదన్‎లోని మరో నలుగురిపై కూడా స్టాప్ గార్డు లైంగిక దాడికి పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు. బాల సదన్‎లోని పిల్లలకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు.