దేశంలో మార్పు రావాలి.. మా లక్ష్యం ఇదే: ప్రశాంత్ భూషణ్ 

దేశంలో మార్పు రావాలి.. మా లక్ష్యం ఇదే: ప్రశాంత్ భూషణ్ 

దేశంలో ప్రస్తుత పాలనను మార్చడానికే తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టామని అన్నారు సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్. గురువారం ( అక్టోబర్ 15 )  సీజేపీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేసారు. మేము ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నామని..ఇందులో తప్పేముందని ప్రశ్నించారు ప్రశాంత్ భూషణ్. బీజేపీ కూడా గతంలో ప్రభుత్వం మారాలని చాలా ఉదయమాలు చేసిందని గుర్తు చేశారు.

ప్రభుత్వం మారాలని కోరుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉందని.. అందుకే బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహ చట్టం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని అన్నారు. ఇది ప్రభుత్వ మార్పు కోసం చేసే పోరాటమని.. ఇందులో ఖచ్చితంగా విజయం సాధిస్తామని అన్నారు ప్రశాంత్ భూషణ్.

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న క్రమంలో ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ నిరసనల్లో ప్రతిపక్షాలు, సీజేపీతో సహా వివిధ విద్యార్థి సంఘాలు ఎన్నికల సంఘంపై విరుచుకుపడుతున్నాయి. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని.. ఆయన ఆధ్వర్యంలో జరిగిన అన్ని ఎన్నికలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

►ALSO READ | పనికిరాని సాకులు చెప్పొద్దు.. ఓట్ కౌంటింగ్ వీడియో ఎలా మిస్సయింది..?ఈసీపై సుప్రీంకోర్టు సీరియస్