
ముఖ్యమంత్రుల పనితీరు గురించి సీ-ఓటర్ నిర్వహించిన సర్వేలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు వచ్చిన ర్యాంకుపై కాంగ్రెస్ పార్టీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి విమర్శించారు. కేవలం 54.28% మంది మాత్రమే కేసీఆర్ కు ప్రజల మద్దతు ఉన్నట్లుగా సీ ఓటర్ సర్వే ప్రకటించిందన్నారు. బుధవారం గాంధీభవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ…. 80 సీట్లు గెలిచామన్న కేసీఆర్.. దేశం అంతా తెలంగాణ వైపే చూస్తుందని గొప్ప గొప్ప మాటలు చెప్పుకుంటున్న సీఎం… సీ ఓటర్ జరిపిన సర్వే లో 16 ర్యాంక్ వచ్చిందంటే సిగ్గుపడాలన్నారు. కేసీఆర్ కు వచ్చిన ర్యాంక్ చూసి తెలంగాణ ప్రజలకు తలదించుకునే పరిస్థితి వచ్చిందన్నారు
కేసీఆర్ సీఎం గా పనిచేసిన ఈ ఆరేళ్ల కాలంలో పరిపాలన కుప్పకూలిందన్నారు. తనకు వచ్చిన ర్యాంక్ పై సీఎం ప్రకటన చేయాలన్నారు. కేసీఆర్ చేసిన తప్పిదాల వల్లే ప్రజల మద్దతు తగ్గుతుందని చెప్పడానికి సీ ఓటర్ సర్వే ఉదాహరణ అని చెప్పారు.