హైదరాబాద్ బేగంపేట డిగ్రీ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు

హైదరాబాద్ బేగంపేట డిగ్రీ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు

పద్మారావునగర్, వెలుగు: బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రిన్సిపాల్‌‌‌‌ పద్మావతి మంగళవారం ప్రకటించారు. ఇంగ్లిష్, కామర్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, బోటనీ, కెమిస్ట్రీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయని, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తామని చెప్పారు. సంబంధిత విభాగంలో పీజీ చేసిన వారు అర్హులని, దరఖాస్తులను ఈ నెల 17 నుంచి కాలేజీ పీజీ బ్లాక్‌‌‌‌లో సమర్పించాలని సూచించారు. 18న ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు.