ముగిసిన ఓట్ల లెక్కింపు : గుజరాత్లో బీజేపీ, హిమాచల్లో కాంగ్రెస్

ముగిసిన ఓట్ల లెక్కింపు : గుజరాత్లో బీజేపీ, హిమాచల్లో కాంగ్రెస్

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు ముగిసింది. గుజరాత్ లో 156  సీట్లను గెలుచుకుని బీజేపీ చరిత్ర సృష్టించగా, హిమాచల్ ప్రదేశ్ లో 40  సీట్లు సాధించి కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. 

గుజరాత్ లో బీజేపీ 156 సీట్లు గెలుచుకుని వరుసగా ఏడోసారి అధికారాన్ని చేపట్టనుంది. గుజరాత్ మళ్లీ బీజేపీదేనని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించినా..అంచనాలను మించి బీజేపీ సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకోగా, ఆప్ 5 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఇతరులు నాలుగు స్థానల్లో విజయం సాధించారు. 

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు ఎప్పటిలానే సాంప్రదాయానికే పట్టం కట్టారు. 1985 నుంచి ఇక్కడ ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. బీజేపీ, కాంగ్రెస్ లకు ఒక్కోసారి అధికారాన్ని కట్టబెడుతూ వస్తున్నారు.  ఇప్పుడు కూడా దీనినే కొనసాగించారు.  తాజా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు 40 సీట్లు రాగా, బీజేపీకి 25, ఇతరులు మూడు స్థానాల్లో గెలుపొందారు.