దేశంలో నలుగురు డేంజరస్ అల్‏ఖైదా టెర్రరిస్టులు అరెస్ట్

దేశంలో నలుగురు డేంజరస్ అల్‏ఖైదా టెర్రరిస్టులు అరెస్ట్

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల వేళ అల్‎ఖైదా టెర్రరిస్ట్ గ్రూప్ ఉగ్రవాదులు అరెస్ట్ కావడం దేశంలో సంచలనంగా రేపుతోంది. 2025, జూలై 23న దేశంలోని వివిధ ప్రాంతాల్లో నలుగురు అల్‎ఖైదా టెర్రరిస్టులు పట్టుబడ్డారు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్వ్కాడ్ (ఏటీఎస్) ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. గుజరాత్‌లో ఇద్దరు, ఢిల్లీలో ఒకరు, నోయిడాలో మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు ఏటీఎస్ అధికారులు. 

గుజరాత్ ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి మాట్లాడుతూ.. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధమున్న నలుగురు టెర్రరిస్టులను అరెస్ట్ చేశామని తెలిపారు. ఇంటలిజెన్స్ నివేదిక ఆధారంగా ఉగ్రవాదుల జాడ కనిపెట్టామని చెప్పారు. ఉగ్రవాదులను విచారిస్తున్నామని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. పార్లమెంట్ వర్షకాల సమావేశాలు జరగుతుండగా.. అది కూడా ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రంలో డేంజరస్ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా టెర్రరిస్టులు పట్టుబడటం కలకలం రేపుతోంది. 

►ALSO READ | వామ్మో వీళ్లు మనుషులేనా.. కాసేపు వెయిట్ చేయండి.. అన్నందుకు రిసెప్షనిస్ట్ను ఎలా కొట్టారో చూడండి

పార్లమెంట్ సమావేశాల వేళ ఉగ్రవాదులు దేశంలో ఏమైనా దాడులకు కుట్ర పన్నారా అన్న కోణంలో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎప్పటి నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు..? గతంలో జరిగిన ఏవైనా దాడుల్లో వీరికి హస్తం ఉందా అని కూపీ లాగుతున్నట్లు తెలిపారు. 

అరెస్ట్ అయిన ఉగ్రవాదుల వివరాలు:

1. మొహమ్మద్ ఫైక్ s/o మొహమ్మద్ రిజ్వాన్ 
2. మహ్మద్ ఫర్దీన్ s/o మహ్మద్ రయీస్ 
3. సెఫుల్లా ఖురేషి s/o మహమ్మద్ రఫీక్ 
4. ⁠జీషన్ అలీ s/o ఆసిఫ్ అలీ