
హాస్పిటల్ అంటేనే రద్దీ. వందల మంది వస్తుంటారు పోతుంటారు. అందరినీ ఒకేసారి డాక్టర్ దగ్గరికి అనుమతించలేం. అందుకోసం కొంత ప్రాసెస్ ఉంటుంది. కన్సల్టేషన్ టైమ్ ను బట్టి కొన్నిసార్లు వేచి ఉండాల్సి వస్తుంది. ఈ విషయంలో అప్పడప్పుడు గొడవలు జరుగుతుండటం చూస్తుంటాం. కానీ చాలా మంది ఉన్నారు.. కాసేపు వేచి ఉండండి అని చెప్పినందుకు ఒక రిసెప్షనిస్టును.. అందులో మహిళ అని కూడా చూడకుండా దారుణంగా కొట్టారు.. తన్నారు కొందరు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. కల్యాణ్ లోని పిసవాలి గ్రామంలో నివసించే సొనాలి కలాసర్.. నందివాలిలోని డా.అనికేత్ పలాండే కు చెందిన బాలఛితికా క్లినిక్ రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. సోమవారం (జులై 21) సాయంత్రం 6 గంటలకు క్లినిక్ వెళ్లిన సమయంలో అప్పటికి డాక్టర్ ఆస్పత్రికి చేరుకోలేదు. అప్పటికే నలుగురు ఐదుగురు పేషెంట్స్ డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నారు. డాక్టర్ర 6.35 కు హాస్పిటల్ కు వచ్చారు. ఆ సమయంలో కొందరు మెడికల్ రిప్రజెంటేటివ్ లు డాక్టర్ ను కలిసేందుకు వెళ్లారు.
ఆ సమయంలో ఒక జంట పాపతో పాటు క్లినిక్ కు వచ్చారు. అయితే డాక్టర్ మెడికల్ రిప్ లతో మాట్లాడుతున్న సమయంలో ఇంకెంత సేపు ఎదురు చూడాలని.. ఆ జంటతో పాటు వచ్చిన గోకుల్ ఝా అనే వ్యక్తి డాక్టర్ క్యాబిన్ కు వెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో డాక్టర్ బిజీగా ఉన్నారు.. ఒక రెండు నిమిషాలు ఆగమని డాక్టర్ చెప్పినట్లు రిసెప్షనిస్ట్ కలాసర్ చెప్పింది. దీంతో డాక్టర్ దగ్గర ఉన్నది ఎవరైతా నాకేంటి.. నన్ను పంపిస్తావా, పంపవా అని కలాసర్ ను బూతులు తిట్టడం మొదలు పెట్టాడు. చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా.. మీరెందుకు అంత ఆవేశపడుతున్నారు.. కాస్త ఆగండి పంపిస్తాం.. అని చెప్పడంతో తిట్టుకుంటూ బయటకు వెళ్లాడు.
►ALSO READ | పార్లమెంట్లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు డేట్, టైమ్ ఫిక్స్.. ఇక మాటల యుద్ధమే..!
బయటకు వెళ్లిన మనిషి.. ఉన్నట్లుండి సడెన్ గా లోపలికి వచ్చి.. దారుణంగా కడుపులో తన్నాడు. మహిళ అని కూడా చూడకుండా బూతులు తిడుతూ ఘోరంగా తన్నాడు. దీంతో ఆ రిసెప్షనిస్ట్ అక్కడిక్కడే కింద పడిపోయింది. అంతటితో ఆగకుండా ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుతూ ఘోరంగా కొట్టాడు. అక్కడ ఉన్న వారు ఎందరు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆవేశంగా ఊగిపోతూ దాడి చేశాడు. ఆ తర్వాత అందరూ అతన్ని బయటకు తీసుకెళ్లడంతో శాంతించాడు.
అకారణంగా తనపై క్రూరంగా దాడి చేసిన ఝా పై పోలీసులకు ఫిర్యాదు చేసింది కలాసర్. డాక్టర్ తోపాటు అక్కడ ఉన్న వాళ్లు చెప్పిన సాక్ష్యాలతో పాటు సీసీటీవీ ఆధారంగా ఝా పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు.
ఆఫీసులలో పనిచేస్తున్న రిసెప్షనిస్టులపై ఏంటి ప్రతాపం అని సోషల్ మీడియాలో చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. సిస్టం కరెక్ట్ గా ఉండేందుకే వాళ్లు పని చేస్తుంటారు. చిన్న జీతం, జీవితం.. వాళ్లపైన దాడి చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.
A receptionist girl beaten up by a Guy
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 22, 2025
in Kalyan MH
pic.twitter.com/ttjy3ZvggR