గుజరాత్ కేబుల్ బ్రిడ్జి : రేపు  ఘటనాస్థలానికి ప్రధాని మోడీ

గుజరాత్ కేబుల్ బ్రిడ్జి : రేపు  ఘటనాస్థలానికి ప్రధాని మోడీ

గుజరాత్ కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ రేపు ఘటనాస్థలాన్ని సందర్శించనున్నారు. ఈ విషయాన్ని గుజరాత్ సీఎంవో కార్యాలయం వెల్లడించింది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ 50,000 చొప్పున మోడీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అటు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. 

కేబుల్ బ్రిడ్జి కూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే 141 మందికి పైగా చనిపోయినట్టు సమాచారం. బ్రిడ్జి కూలిన ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేశామని, ఐదుగురు సభ్యులతో కూడిన అత్యున్నత కమిటీ విచారణ చేస్తోందని గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు.  కేబుల్ బ్రిడ్జి ఘటన అనంతరం అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో ఎక్కువగా చిన్నారులు, మహిళలే ఉన్నారు.