EVM ట్యాంపరింగ్ చేశారని కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

EVM ట్యాంపరింగ్ చేశారని కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగా కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపిస్తూ గాంధీధామ్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి భరత్‌ భాయ్ వెల్జీభాయ్ సోలంకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. మెడుకు కండువా బిగించి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా..అక్కడున్న పోలీసులు, ఇతర సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బీజేపీ అభ్యర్ధి మాల్తీ కిషోర్ మహేశ్వరి కంటే కాంగ్రెస్ అభ్యర్థి భరత్‌ భాయ్ వెల్జీభాయ్ సోలంకి 12,000 ఓట్లకుపైగా వెనుకబడి ఉన్నారు. కొన్ని ఈవీఎంలను సరిగ్గా సీల్ చేయలేదని సోలంకి ఆరోపించారు. మరోవైపు గుజరాత్ లో అధికార బీజేపీ చరిత్ర సృష్టించింది. 156 స్థానాలను గెలుచుకున్న బీజేపీ మరో 9 స్థానాల్లోనూ లీడింగ్ లో ఉంది. అటు కాంగ్రెస్ 17 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. ఆప్ 5 స్థానాలను గెలుచుకుంది.