ప్రశాంతంగా ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు

ప్రశాంతంగా ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇప్పటి వరకు 50.51 శాతం పోలింగ్ నమోదైంది. క్యూలైన్లలో ఉన్నవారికి ఓటువేసే అవకాశాన్ని కల్పిచారు. గుజరాత్ లో మొత్తం రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. 182 స్థానాలకుగానూ.. తొలి దశలో 89 నియోజకవర్గాలకు ఈ నెల 1న ఓటింగ్ నిర్వహించారు. రెండో దశలో 93 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాతో సహా పలువురు ప్రముఖులు ఓటుహక్కు వినియోగించుకున్నారు.

 

రెండో దశలో 833 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 26 వేల 409 పోలింగ్ కేంద్రాల్లో గుజరాత్ శాసనసభ ఎన్నికల రెండో దశ ఓటింగ్ జరిగింది. సాయంత్రం 6గంటల తర్వాత పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ లో 63.31శాతం ఓటింగ్ నమోదైంది. గిరిజనుల ప్రాబల్య జిల్లా నర్మదలో అత్యధికంగా 78.24 శాతం నమోదైంది.. రెండో దశలోనూ 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదయ్య అవకాశం కనిపిస్తోంది. 

గుజరాత్ రెండోవిడత ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఘట్లోడియా నియోజకవర్గం నుంచి సీఎం భూపేంద్ర పటేల్, వీరమ్ గామ్ నుంచి పటీదార్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ పోటీలో ఉన్నారు. దక్షిణ గాంధీనగర్ నియోజకవర్గం నుంచి ఓబీసీ నాయకుడు అల్పేష్ ఠాకూర్ పోటీ చేస్తున్నారు. వడ్గామ్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీ బరిలో ఉన్నారు.