గుజరాత్లో మరోసారి బీజేపీ సర్కారు..!

గుజరాత్లో మరోసారి బీజేపీ సర్కారు..!
  • హిమాచల్‌‌ప్రదేశ్‌‌లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ 
  • ఢిల్లీ మున్సి‘పోల్స్​’​లో ఆప్​ వైపే జనం మొగ్గు 

గుజరాత్​లో అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం సాయంత్రం పోలింగ్​ పూర్తవడంతో ఎగ్జిట్​ పోల్స్ సర్వే ఫలితాలు రిలీజ్ అయ్యాయి.  మెజార్టీ సంస్థలు మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి.  కాంగ్రెస్ రెండో స్థానం, ఆమ్​ ఆద్మీ పార్టీ మూడో ప్లేస్​కు పరిమితమవుతాయని తెలిపాయి. గుజరాత్​లో 182 అసెంబ్లీ  స్థానాలు ఉండగా మ్యాజిక్​ ఫిగర్​ 92. జన్​కీ బాత్, రిపబ్లిక్​ టీవీ పీ-మార్క్​, న్యూస్​ ఎక్స్​తో పాటు పీపుల్స్​ పల్స్​ సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా తీర్పు చెప్పాయి. 100కుపైగా స్థానాల్లో గెలుస్తుందని ప్రకటించాయి. ఇక హిమాచల్‌‌ప్రదేశ్‌‌లో మాత్రం అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్​ మధ్య హోరాహోరీ పోరు ఉండే చాన్స్ ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఢిల్లీ మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల్లో మాత్రం ఎగ్జిట్​ పోల్స్​ సర్వేలన్నీ ఆప్​ వైపే మొగ్గు చూపాయి.

గుజరాత్​లో మళ్లీ బీజేపీ అధికారంలోకి రాబోతున్నట్టు ఎగ్జిట్​ పోల్​ సంస్థలు అంచనా వేశాయి. మోడీ సొంత రాష్ట్రం కావడంతో ఎప్పటిలాగే ఆయన సెంటిమెంట్​ బీజేపీకి లాభం చేకూర్చింది. వరుస అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలతో పాటు మోడీ, అమిత్​షాలు గ్రౌండ్​ లెవల్ నుంచి వ్యూహాలు రచించడంతో గుజరాత్​లో బీజేపీ మరింత పట్టు సాధించింది. ఇక హిమాచల్‌‌ప్రదేశ్‌‌లో మాత్రం అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్​ మధ్య హోరాహోరీ పోరు ఉండే చాన్స్ ఉందని సర్వేలు చెబుతున్నాయి. రెండోసారి అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్​ ప్రయత్నిస్తున్నది. పంజాబ్‌‌లో విక్టరీతో స్పీడ్‌‌ మీదున్న ఆమ్‌‌ ఆద్మీ పార్టీ.. అటు గుజరాత్, ఇటు హిమాచల్‌‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. రెండు రాష్ట్రాల్లోనూ సింగిల్​ డిజిట్​కే పరిమితమయ్యే చాన్స్ ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఇక ఢిల్లీ మున్సిపల్​ కార్పొరేషన్​ (ఎంసీడీ) ఎన్నికల్లో మాత్రం ఎగ్జిట్​ పోల్స్​ సర్వేలన్నీ ఆప్ ​వైపే మొగ్గు చూపాయి. ఇక్కడ ఆప్​ టాప్​లో ఉండగా.. రెండు, మూడు స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్​ ఉన్నాయి. 7న ఎంసీడీ, 8న గుజరాత్, హిమాచల్​ప్రదేశ్​ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

మోడీ ఇలాకాలో ఈసారి సెంచరీ..

అహ్మదాబాద్: గుజరాత్​లోని 182 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌ 1న, డిసెంబర్‌ 5న రెండు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. సోమవారం సాయంత్రం ఎగ్జిట్​ పోల్స్ సర్వే ఫలితాలు రిలీజ్ అయ్యాయి. గుజరాత్​లో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని అన్ని ప్రముఖ ఎగ్జిట్​ పోల్​ సంస్థలు ప్రకటించాయి. కాంగ్రెస్ రెండో స్థానంలో ఉండగా, ఆమ్​ ఆద్మీ పార్టీ మూడో ప్లేస్​కు పరిమితమైనట్టు స్పష్టం అవుతున్నది. 182 స్థానాల్లో మ్యాజిక్​ ఫిగర్​ 92. బీజేపీయే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్ని సంస్థలు ప్రకటించాయి. 27ఏండ్లుగా గుజరాత్​లో బీజేపీ అధికారంలో ఉంది. ఈసారి కూడా మోడీ చరిష్మానే పని చేసింది. జన్​కీ బాత్, రిపబ్లిక్​ టీవీ పీ–మార్క్, న్యూస్​ ఎక్స్, టీవీ–9 గుజరాతీతో పాటు పీపుల్స్​ పల్స్​ సహా సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా తీర్పు చెప్పాయి. 100కి పైగా స్థానాల్లో గెలుస్తుందని ప్రకటించాయి. బీజేపీ ఒంటరిగా పోటీ చేయగా.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్​పార్టీ.. ఎన్​సీపీతో జతకట్టింది. ఆమ్​ ఆద్మీ పార్టీ సింగిల్​గా బరిలో దిగింది. 2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. బీజేపీ భారీ ఆధిక్యతను ప్రదర్శించినట్టు తెలుస్తున్నది. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 99 సీట్లు వస్తే.. కాంగ్రెస్ 77 స్థానాల్లో గెలిచింది. ఎన్​సీపీ ఒక సీటుతో సరిపెట్టుకోగా.. ఆమ్​ ఆద్మీ పార్టీ ఖాతానే తెర్వలేదు. అయితే ఈసారి మాత్రం బీజేపీ సెంచరీ కొడుతుందనే అన్ని ఎగ్జిట్​ పోల్ సర్వేలు చెబుతున్నాయి.