టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న గుజరాత్.. కేకేఆర్ తుది జట్టులోకి వరుణ్ చక్రవర్తి 

టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న గుజరాత్.. కేకేఆర్ తుది జట్టులోకి వరుణ్ చక్రవర్తి 

ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) vs గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదట బౌలింగ్ తీసుకున్నాడు. వర్షం కురవడం వల్ల పిచ్‌పై తేమ ఉండటంతో గిల్ వ్యూహాత్మకంగా బౌలింగ్ తీసుకోవడంతో.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే కేకేఆర్ ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసి గుజరాత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాల్సి ఉంటుంది. పవర్‌ఫుల్ గుజరాత్ బౌలింగ్‌ను కేకేఆర్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. మేము మొదట బౌలింగ్ చేయాలనుకుంటున్నాం.. ఇక్కడ కొద్దిగా వర్షం పడింది.. సెకండ్ ఇన్నింగ్స్‌లో పిచ్ బ్యాటింగ్‌కు మరింత అనుకూలిస్తుందని ఆశిస్తున్నాం.. మా బౌలింగ్ యూనిట్ ఈ సీజన్ అంతటా అద్భుతమైన ఫామ్‌లో ఉంది.. ప్రస్తుతం విన్నింగ్ మొమెంటం మా వైపే ఉంది.. లీగ్ ఈ దశకు చేరినప్పుడు ఏ జట్టునూ తక్కువగా అంచనా వేయలేం.. పాయింట్ల పట్టికలో టాప్-2లో ముగిస్తే ప్లేఆఫ్స్‌లో అదనంగా ఒక మ్యాచ్ (క్వాలిఫైయర్) ఆడే అవకాశం లభిస్తుంది., కాబట్టి ఈ మ్యాచ్ మాకు చాలా కీలకం.. మేము గత మ్యాచ్ లో పాత జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని గిల్ వెల్లడించాడు. 

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ.. మేము కూడా మొదట ఫీల్డింగ్ చేయాలనే అనుకున్నాం.. పిచ్‌పై కొద్దిగా తేమ (Moisture) ఉంది, ఈ మ్యాచ్ సాగుతున్న కొద్దీ ఇందులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.. మేము ప్రస్తుతం ప్రతీ మ్యాచ్‌ను విడివిడిగా చూస్తున్నాం.. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే మేము మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలవాలి, ఆపై ఏం జరుగుతుందో చూడాలి.. గత ఐదు మ్యాచుల నుంచి మా జట్టు నిజంగా చాలా మంచి క్రికెట్ ఆడుతోంది.. ఇక టీమ్ లోకి వరుణ్ చక్రవర్తి తిరిగి జట్టులోకి వచ్చాడని రహానే పేర్కొన్నాడు.  

ఇరు జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే(కెప్టెన్), ఫిన్ అలెన్, అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, మనీష్ పాండే, రింకూ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, సౌరభ్ దూబే, కార్తీక్ త్యాగి

గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్