ఒక్క ఓటరు కోసం పోలింగ్ సెంటర్

ఒక్క ఓటరు కోసం పోలింగ్ సెంటర్

అహ్మదాబాద్‌: గుజరాత్‌ లో ఎన్నికలు జరిగే ప్రతిసారి గిర్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోని బనేజ్‌ పోలింగ్‌ కేంద్రం పేరు వార్తల్లో నిలుస్తుంది. మహనత్‌ భరత్‌దాస్‌ అనే ఆలయ పూజారి కోసం 26 కిలోమీటర్ల దూరంలో అడవిలో  పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది ఎన్నికల సంఘం. పోలింగ్‌ రోజున ఆరుగురు సిబ్బంది డ్యూటీలు నిర్వహిస్తారు. వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లోనూ బనేజ్‌ లో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే ..పోలింగ్‌ కేంద్రానికి బదులుగా భరత్‌ దాస్‌ ఓటు వేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని అభిప్రాయ పడుతున్నారు. అడవీలో పోలింగ్‌ బూత్‌ ను పెట్టడం కంటే.. దగ్గరలోని పోలింగ్‌ కేంద్రానికి ఓటరను తీసుకెళ్లి, మళ్లీ తన ఇంటి దగ్గర దిగబెట్టే సదుపాయాలు కల్పిస్తే మంచిదని చెబుతున్నారు.