న్యూయార్క్: అమెరికాలో మన దేశ మూలాలున్న అమిత్ కుమార్ పటేల్(45) హత్యకు గురయ్యారు. డబ్బులు డిపాజిట్ చేద్దామని పోతుండగా బ్యాంకు దగ్గరలో గుర్తుతెలియని వ్యక్తి ఆయనను కాల్చి చంపాడు. డబ్బులు దోచుకుని పారిపోయాడు. జార్జియాలోని కొలంబస్లో మంగళవారం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. అమిత్ కుమార్.. స్టీమ్ మిల్ రోడ్‌వద్ద పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నాడని, వారం నుంచి జమైన డబ్బు లు బ్యాంకులో వేసేందుకు వెళ్తుండగా చోరీ జరిగిందని చెప్పారు. బ్యాంకు దగ్గరకు చేరుకోగానే అమిత్‌ను దుండగుడు పిస్టల్‌తో కాల్చి, క్యాష్ ఉన్న బ్యాగ్ తీసుకుని పారిపోయాడని తెలిపారు. పెట్రోల్ బంకులోవచ్చిన డబ్బును ప్రతివారం బ్యాంకులో డిపాజిట్ చేస్తామని, అదేపని మీద వెళ్తుండగా ఎవరో వెంబడించి ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని అమిత్ బిజినెస్ పార్ట్నర్ విన్నీ పోలీసులకు తెలిపారు.
