ఇంటింటికీ తాగునీరే లక్ష్యం : ముప్పారం సర్పంచ్ గుంటిపల్లి రేణుక

ఇంటింటికీ తాగునీరే లక్ష్యం : ముప్పారం సర్పంచ్ గుంటిపల్లి రేణుక

ధర్మసాగర్, వెలుగు: ఇంటింటికీ తాగునీరు ఇవ్వాలని లక్ష్యంతో పనులు చేపట్టినట్లు హనుమకొండ జిల్లా ధర్మసాగర్​ మండలం ముప్పారం సర్పంచ్ గుంటిపల్లి రేణుక తెలిపారు. ఆదివారం జీపీ ఆఫీస్​లో ఆర్​డబ్ల్యూఎస్​ ఏఈ చంద్రు నాయక్ తో కలిసి నీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. అనంతరం గ్రామంలో పర్యటించి తాగునీరు అందని కాలనీలను పరిశీలించారు. 

సర్పంచ్ రేణుక మాట్లాడుతూ గ్రామంలో ఎనిమిది చేతిపంపులకు మరమ్మతులు చేపట్టామని, రూ.3 లక్షలతో మిషన్ భగీరథ పథకం కింద తాగునీరును ప్రతి ఇంటికి అందించాలన్న లక్ష్యంతో పెండింగ్ పనులను పూర్తి చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్లపల్లి కుమారస్వామి గౌడ్, శ్వేతా విద్యాసాగర్, విజయ చందర్, శోభ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.