స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై కేసు నమోదు

స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుపై గుంటూరు జిల్లా రాజుపాలెం పోలీసులు కేసు పెట్టారు. కోడెల శివప్రసాద రావుతో పాటు.. 22 మందిపై 8 సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు పోలీసులు. ఈ ఉదయం హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాత… ఈ పరిణామం జరిగింది.

పోలింగ్ రోజున రాజుపాలెం మండలం ఇనుమెట్ల గ్రామం పోలింగ్ బూత్ లోకి స్పీకర్ కోడెల శివప్రసాద్ రావడంతో..అక్కడ టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. స్పీకర్ కోడెల… పోలింగ్ బూత్ లోపలికి వెళ్లి చాలాసేపు తలుపులు మూసేశారు. ఆ తర్వాత ఆయన చిరిగిన చొక్కాతో బయటకు రావడం చూసి చాలామంది షాకయ్యారు. వైసీపీ కార్యకర్తలు తనపై విచక్షణ లేకుండా దాడి చేశారని ఆయన అన్నారు. ఐతే… కోడెల తన చొక్కా తానే చించుకుని తమపై ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నాయకులు చెప్పారు. సంఘటన జరిగిన రోజు పోలీసులు వైసీపీ నేతలపై కేసు పెట్టారు.

ఈ మొత్తం వ్యవహారం… స్పీకర్ పోలింగ్ బూత్ లోకి వెళ్లి తలుపులు వేయడం లాంటి అంశాలన్నింటిపైనా జగన్.. గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే జిల్లా పోలీసులు స్పీకర్ పై కేసు పెట్టారు.