కైరో: ఇండియా షూటర్ గుర్‌ప్రీత్ సింగ్.. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో తృటిలో స్వర్ణాన్ని కోల్పోయాడు. సోమవారం (నవంబర్ 17) జరిగిన మెన్స్ 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఫైనల్లో గుర్‌ప్రీత్ 584 పాయింట్లతో రెండో ప్లేస్‌లో నిలిచి సిల్వర్‌తో సంతృప్తిపడ్డాడు.
ఉక్రెయిన్ షూటర్ పావ్లో కొరోస్టిలోవ్ కూడా 584 పాయింట్లే సాధించినా 29 సార్లు 10/10 పాయింట్లు గెలవడంతో పాటు ర్యాపిడ్ ఆఖరి రౌండ్‌లో వంద పాయింట్లు గెలిచి గోల్డ్‌ను సొంతం చేసుకున్నాడు. గుర్‌ప్రీత్ 18సార్లు మాత్రమే 10/10 పాయింట్లు కొట్టాడు. యాన్ పియరీ లూయిస్ ఫ్రిడ్రిసి (ఫ్రాన్స్) బ్రాంజ్ మెడల్‌ను కైవసం చేసుకున్నాడు.
వరల్డ్ చాంపియన్‌షిప్‌లో గుర్‌ప్రీత్‌కు ఇది రెండో పతకం కావడం విశేషం. ఓవరాల్‌గా ఇండియా 3 స్వర్ణాలు, 6 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 13 పతకాలతో మూడో ప్లేస్‌తో ఈ టోర్నీని ముగించింది.
