డార్క్ కామెడీతో గుర్రం పాపిరెడ్డి

డార్క్ కామెడీతో గుర్రం పాపిరెడ్డి

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన  సినిమా  ‘గుర్రం పాపిరెడ్డి’. మురళీ మనోహర్ దర్శకత్వంలో  వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించారు. డిసెంబర్ 19న సినిమా విడుదల కానుంది.  సోమవారం ఈ చిత్రం నుంచి  ‘పైసా డుమ్ డుమ్’  సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌‌లో నరేష్ అగస్త్య మాట్లాడుతూ ‘ఈ సాంగ్ అందరికీ నచ్చుతుంది.  ఇందులో  నా ఇంటిపేరు గుర్రం. నా పేరు పాపిరెడ్డి.  నా కెరీర్‌‌‌‌లో ఇదొక కొత్త తరహా క్యారెక్టర్‌‌‌‌లా పేరొస్తుంది. ప్రాపర్ లాజిక్‌‌తో  మన సెన్సిబిలిటీస్ కోల్పోకుండా ఈ చిత్రాన్ని రూపొందించాం’ అని చెప్పాడు.   

ఫరియా అబ్దుల్లా  మాట్లాడుతూ ‘-మా టీమ్ అంతా ఒక కొత్త తరహా మూవీ చేసేందుకు ప్రయత్నించాం.   టిపికల్ మూవీగా కాకుండా సినిమా అంతా మంచి ఫన్ ఉండేలా చూసుకున్నాం.  కామెడీలోనే  కొత్తగా కంటెంట్ క్రియేట్ చేయొచ్చు అని ఈ సినిమా నిరూపిస్తుంది’ అని చెప్పింది. డార్క్ కామెడీ జానర్‌‌‌‌లో  కొత్తగా ప్రయత్నించామని, తెలివైనవారు, తెలివితక్కువ వారి మధ్య జరిగిన యుద్ధమే  ఈ మూవీ కాన్సెప్ట్ అని దర్శకుడు మురళీ మనోహర్ అన్నాడు. ఈ చిత్రం అందరినీ ఎంటర్‌‌‌‌టైన్ చేస్తుందని నిర్మాత జయకాంత్ అన్నారు. నటులు  జీవన్ కుమార్, రాజ్ కుమార్ కాసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.