గురు పౌర్ణమి 2025: జులై 10 న ఇలా చేయండి .. కెరీర్‌లో సక్సెస్‌ పొందుతారు..!

గురు పౌర్ణమి 2025:  జులై 10 న ఇలా చేయండి .. కెరీర్‌లో సక్సెస్‌ పొందుతారు..!

ప్రతి ఒక్కరు కెరీర్​ లో సక్సెస్​ పొందాలనుకుంటారు.  కొంతమంది ఈ విషయంలో విజయం సాధించగా మరికొంతమందికి అడ్డంకులు ఏర్పడుతాయి. అలాంటి వారు గురు పౌర్ణమి రోజున ( ఆషాఢమాసం.. పూర్ణిమ) జులై 10 కొన్ని పరిహారాలు పాటిస్తే ఆదోషం తొలగిపోయి.. జీవితంలో సక్సెస్​ సాధిస్తారని పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .!  

విద్యలో ఎంత రాణించినా.. ఎన్ని తెలివితేటలున్నా.. ఉన్నా కాని కెరీర్​ లో మాత్రం అనుకున్న స్థానాన్ని పొందలేదు.  అలాంటి వారు తెలిసో... తెలియక గురువులను అవమానపరిచారని అలాంటి వారు కెరీర్​ లో సక్సెస్​ సాధించలేరని పద్మ పురాణం ద్వారా తెలుస్తుంది.  మానవులు  జీవితంలో ఆచరించే ప్రతి పనికి పురాణాల్లో కొన్ని విషయాలను ప్రామాణికంగా తీసుకుంటారు.  

హిందూ సంప్రదాయం ప్రకారం..  జులై 10 న ఆషాఢ పౌర్ణమి తిథి రోజున   గురు పౌర్ణమి  జరుపుకుంటాము. . ఈ  ఆరోజు కొన్ని పరిహారాలు పాటిస్తే జీవితంలో సక్సెస్​ సాధిస్తామని పురాణాలు చెబుతున్నాయి.    సనాతన ధర్మంలో గురువుకు భగవంతునితో సమానమైన హోదా ఉంది. ఆ రోజున ( జులై 10) గురువును.. తండ్రిని పూజించాలి.  ఇలా చేయడం దో షాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు.  అంతేకాదు గురువులకు కొన్ని రకాల వస్తువులను దానం చేయాలి.  గురువు అందుబాటులో లేకపోతే...  దేవాలయంలో పూజారిని గురువుగా భావించి వారికైనా ఇవ్వాలి. 

గురు బ్రహ్మా, గురు విష్ణుః, గురు దేవో మహేశ్వరః.
 గురు సాక్షాత్​ పరబ్రహ్మ...తస్మై శ్రీ గురవే నమ:


ఈ రోజున గురువును ఆరాధించడం వలన పితృ దోషం, గురు గ్రహం యొక్క చెడు ఫలితాలు తొలగిపోతాయి. జ్ఞానం, శ్రేయస్సు కలుగుతాయి. 

ఏమేమి దానం చేయాలంటే...

 దుస్తులు: పసుపు రంగు దుస్తులను గురు పౌర్ణమి నాడు గురువుకు ఇవ్వడం మంచిది. ఇది నిజానికి శుభ ఫలితాలను అందిస్తుంది. ఇలా చేయడం గురు గ్రహానికి సంతోషం కలుగుతుంది.  గురువు విద్య..ఙ్ఞానం కలుగచేస్తాడు.  ఇలా పసుపు రంగు వస్త్రాలను గురువుకు దానం చేస్తే కెరీర్‌లో సక్సెస్‌ను కూడా పొందవచ్చని పండితులు చెబుతున్నారు.

స్వీట్స్​ : పసుపు రంగులో ఉండే స్వీట్లను గురువుకు ఆరోజు ( జులై 10)  ఇవ్వడం మంచిది. అలా చేయడం వలన గురు గ్రహం అనుకూలంగా ఉంటుంది. పితృ దోషాల నుండి బయటపడేందుకు ఉపయోగపడుతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి.  

పసుపు:  గురువుకు పసుపును ఇచ్చి పాదాభివందనం చేయాలి.  పసుపు స్వచ్ఛతకు చిహ్నం. పసుపును గురువుకు ఇవ్వడం వలన అనారోగ్య సమస్యలు, పేదరికం, జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. వైవాహిక జీవితం సంతోషంగా, ప్రశాంతంగా ఉంటుంది.

►ALSO READ | చాతుర్మాస దీక్ష ( జులై 6 నుంచి నవంబర్ 2వరకు ) : నాలుగు నెలల పాటు పాటించాల్సిన నియమాలు ఇవే..!

 పండ్లు: పసుపు రంగు పండ్లను గురు పౌర్ణమి నాడు గురువుకు ఇవ్వడం మంచిది. అరటి పండ్లు, మామిడి పండ్లు వంటి వాటిని గురువుకు ఇవ్వడం వలన గురు గ్రహ అనుగ్రహం లభిస్తుంది. తెలివి తేటలు పెరుగుతాయి... అదృష్టం కూడా వస్తుంది. అందుకే పెద్దలకు తాంబూలం ఇచ్చే సమయంలో తమలపాకులు అరటిపండ్లు ఇస్తారు. 

 పూలు: పసుపు రంగులో ఉండే సంపంగి పూలు, చామంతి పూలు వంటి పూలను గురువుకు ఇవ్వండి.  మెదడు ప్రశాంతంగా మారుతుంది, గురు గ్రహం అనుగ్రహం పొందుతారు. 

గురు పౌర్ణమి నాడు ఈ  వస్తువులను గురువుకు ఇవ్వడం వలన జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి, సంతోషంగా ఉండవచ్చు.  పూర్వీకుల ఆశీర్వాదాలు లభిస్తాయి.  గురు గ్రహం నుండి శుభ ఫలితాలను పొందవచ్చు, జీవితం సంతోషంగా ఉంటుంది.