ఫేక్ కాల్ సెంటర్ గుట్టు రట్టు చేసిన పోలీసులు

ఫేక్ కాల్ సెంటర్ గుట్టు రట్టు చేసిన పోలీసులు

హర్యానాలో ఫేక్ కాల్ సెంటర్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. గురుగ్రామ్లోని ఉద్యోగ్ విహార్ ఫేజ్ 3 కేంద్రంగా పనిచేస్తున్న నకిలీ కాల్ సెంటర్పై ఆకస్మికంగా దాడి చేసి... అక్కడ పనిచేస్తున్న 38 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 9మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. సదరు కాల్ సెంటర్ చైనీస్ యాప్స్ లోన్ రికవరీ పేరుతో జనాలను దోచుకుంటున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. మొబైల్కు కొన్ని లింకుల పంపి వాటిని ఓపెన్ చేసిన వారి ఫోన్లు హ్యాక్ చేస్తున్నట్లు బాధితులు ఆరోపించారు. హ్యాక్ చేసిన ఫోన్లలోని పర్సనల్ ఫొటోలు, ఇతర వివరాలు సేకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న కంప్లైంట్పై స్పందించిన పోలీసులు.. కాల్ సెంటర్లో సోదాలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఉద్యోగులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నట్లు గురుగ్రామ్ ఏసీపీ ప్రీత్ పాల్ చెప్పారు.