హైదరాబాద్ లో రూ.కోటి విలువైన గుట్కా స్వాధీనం

హైదరాబాద్ లో రూ.కోటి విలువైన గుట్కా స్వాధీనం

హైదరాబాద్ లో సౌత్, నార్త్, ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి ..కోటి రూపాయల విలువ గల‌ నిషేధిత గుట్కా స్వాధీనం‌ చేసుకున్నట్లు తెలిపారు సీపీ అంజనీ కుమార్. తెలంగాణలో అత్యధికంగా మొదటి సారి నిషేధిత గుట్కాను సీజ్ చేసినట్లు తెలిపారు. గుట్క, మట్కా, పేకాట, క్లబ్స్ పై నిషేదం ఉందన్నారు. వాటిని ఎవరు అమ్మినా వారిపై  కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

బీదర్, నాందేడ్, మహారాష్ట్ర నుంచి‌ పెద్ద ఎత్తున గుట్క  హైదరాబాద్ కు రవాణా జరుగుతోందన్నారు సీపీ  అంజనీ కుమార్. టాస్క్ ఫోర్స్ పోలీసులు అలర్ట్ గా ఉన్నారని.. ఐదుగురు గుట్కా సరఫారా. చేస్తున్నట్టు గుర్తించామన్నారు. ఇందులో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

గడిచిన  2020 సంవత్సరంలో లో 689 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు సీపీ. 654మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. ఈ ఏడాది  2021లో  159 కేసులు నమోదు చేశామన్నారు. నిషేధిత గుట్కా రవాణ చేస్తున్న  173 అరెస్ట్ చేశామన్నారు. ప్రజలు ఇలాంటి వారి గురించి ఎలాంటి సమాచారం తెలిసినా.. పోలీస్ వాట్సాప్ నెంబర్ 9490616555 కి సమాచారం అందించగలరని తెలిపారు సీపీ అంజనీ కుమార్.