బీఆర్ఎస్ లో నేతలకు అహంకారం నెత్తికెక్కింది: గుత్తా సుఖేందర్ రెడ్డి

బీఆర్ఎస్ లో నేతలకు అహంకారం నెత్తికెక్కింది: గుత్తా సుఖేందర్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో నేతలకు అహంకారం నెత్తికెక్కిందని వ్యాఖ్యానించారు. పార్టీ నాయకత్వంపై విశ్వాసం లేకనే కొంత మంది పార్టీ వీడుతున్నారని చెప్పారు. నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో పార్టీ ఓడిపోవడానికి జిల్లా మంత్రులే కారణమన్నారు. పార్టీలో అంతర్గత సమస్యలు ఉన్నాయని కేసీఆర్ కు చెప్పిన  పట్టించుకోలేదన్నారు.  అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే కేసీఆర్ ఎవరికీ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ లేదన్నారు. ఓటమితో బాధపడుతున్న కేసీఆర్ ని ఫామ్ హౌస్ లో కలిసి పరిస్థితులు వివరించా అయినా వినలేదని చెప్పారు.  ఇప్పటికైనా BRS పార్టీ మేలుకొనకపోతే నష్టం తప్పదని హెచ్చరించారు. 
 
తనకు ఎవరి దయాదాక్షిన్యాయాల మీద పదవులు రాలేదని.. తాను ప్రజా నాయకుడినని చెప్పారు గుత్తా సుఖేందర్ రెడ్డి. తన కొడుకు అమిత్ రెడ్డి ఎన్నికల్లో పోటీకి జిల్లాలోని కొంత మంది నేతలు సహకరించలేదు. అందుకే పోటీ నుంచి తప్పుకున్నాము.  అమిత్ రాజకీయ భవిష్యత్ కాలమే నిర్ణయిస్తుందన్నారు గుత్తా