ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేటుగాళ్లు... గ్రామీణులే టార్గెట్

ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేటుగాళ్లు... గ్రామీణులే టార్గెట్

నాసిరకమైన ఐస్ క్రీములు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ లో నాసిరకమైన ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు సంబంధిత ఫ్యాక్టరీపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా నకిలీ ఐస్ క్రీమ్లు  దొరికాయి.  ఈ దాడుల్లో పట్టుబడిన ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10లక్షల విలువ చేసే ఐస్ క్రీమ్లు, వాహనాలను సీజ్ చేశారు.

అపరిశుభ్ర వాతావరణం.. కల్తీ పదార్థాలు

ఫుడ్ సేప్టీ అథారిటీ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా నిర్వహిస్తున్న ఈ ఫ్యాక్టరీని చూస్తే వినియోగదారులకు మతి పోవాల్సిందే. పరిశ్రమలో అపరిశుభ్రత తాండవిస్తుండగా, ఐస్ క్రీమ్ లో వాడే పదార్థాలలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు.  వీటికి ఆకర్షణీయమైన స్టికర్లు అంటించి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు కేటుగాళ్లు. గ్రామాలే వీరి ప్రధాన టార్గెట్గా కనిపిస్తోంది.