108 పైలట్ కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సాయం

108 పైలట్ కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సాయం

బాల్కొండ, వెలుగు : బాల్కొండ 108లో పైలట్ గా విధులు నిర్వహిస్తూ అకాల మరణం చెందిన శ్రీనివాస్ కుటుంబానికి జీవీకే ఈఎంఆర్ఐ ఎస్ హెచ్ వో సుధాకర్,హెచ్ఆర్ హెడ్ కిరణ్ కిషోర్ రూ.5లక్షల ఆర్థిక సాయం అందజేశారు. సోమవారం శ్రీనివాస్ భార్య గంగాసాగర కు చెక్కు అందించారు.

నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పర్ధి(కె)కు చెందిన శ్రీనివాస్ 8ఏళ్లుగా 108లో పని చేస్తున్నాడు. అంకితభావంతో పనిచేసి గత ఏడాది జూలై20న మృతి చెందారు. కార్యక్రమంలో రవీందర్,ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం సూపర్ వైజర్ స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.