జ్ఞానవాపి మసీదులో ఏఎస్‌ఐ సర్వేకు లైన్ క్లియర్

జ్ఞానవాపి మసీదులో ఏఎస్‌ఐ సర్వేకు లైన్ క్లియర్

వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదుపై భారత పురావస్తు శాఖ సర్వేకు ఎట్టకేలకు అనుమతి లభించింది. సర్వేపై క్లారిటీ ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు... జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో ఏఎస్‌ఐ సర్వే నిర్వహించాలన్న జిల్లా కోర్టు ఆదేశాలను సమర్థించింది. 

ALSO READ:అమరావతిలో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే

ముస్లిం పక్షం పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం.. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఏఎస్‌ఐ సర్వే అవసరమని పేర్కొంది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వేకు మొదట అనుమతి ఇచ్చిన వారణాసి కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా అంజుమాన్ ఇంతేజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు  తోసిపుచ్చింది. జూలై 27న తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు, మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వేకు మార్గం సుగమం చేసింది.