యువతిపై లైంగిక దాడికి పాల్పడిన జిమ్ ట్రైనర్

యువతిపై లైంగిక దాడికి పాల్పడిన జిమ్ ట్రైనర్

హైదరాబాద్ లో ఓ యువతిపై జిమ్ ట్రైనర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. టోలిచౌకిలో కొన్నేళ్లుగా ఆసిమ్ అనే యువకుడు జిమ్ సెంటర్ నడిపిస్తున్నాడు. ఏడాది క్రితం అదే ప్రాంతంలో నివాసముంటున్న ఓ యువతి జిమ్ లో జాయిన్ అయింది. ఆమెతో పరిచయం పెంచుకున్న ఆసిమ్ ప్రేమ పేరుతో యువతి వెంటపడ్డాడు. ఇటీవల ఆసిమ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఆమెపై లైంగిక దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.పెళ్లి మాట ఎత్తగానే ముఖం చాటేశాడు. 

జిమ్ ట్రైనర్ ఆసిమ్ పై చర్యలు తీసుకోవాలని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లో బాధిత యువతి ఫిర్యాదు చేసింది. దీంతో  నిందితుడిపై ఐపీసీ 376, 417,420, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.