హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు కురిసే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. సంగారెడ్డిలోని ఆర్సీపురంలో 2.5 సెంటీమీటర్లు, బీహెచ్‌ఈఎల్ ఫ్యాక్టరీలో2, రంగారెడ్డిలోని దండుమైలారంలో 1.6 సెం.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో టెంపరేచర్లు కాస్త తగ్గాయి. టీఎస్‌డీపీఎస్ డేటా ప్రకారం ఆదిలాబాద్ అర్బన్, మహ బూబ్‌నగర్‌లోని రాజాపూర్‌లలో 40.1, ఆదిలాబాద్‌లోని చాప్రాల, బేల, వనపర్తిలలో 40 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కుమ్రం భీం జిల్లాలో 27.7, ఆదిలాబాద్‌లో 26.8 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి.
