స్మార్ట్ & న్యూ లుక్ లో రాహుల్ గాంధీ

స్మార్ట్ & న్యూ లుక్ లో రాహుల్ గాంధీ

కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ కొత్త లుక్ కు టర్న్ అయ్యారు. భారత్ జోడో యాత్ర నుంచి టీ షర్టు, గడ్డంతో కనిపించిన ఆయన.. ఇప్పుడు స్మార్ట్ గా కనిపిస్తూ.. అందర్నీ అట్రాక్ట్ చేస్తున్నారు. ఇటీవల లండన్ లోని కేంబ్రిడ్జ్ ని రాహుల్ గాంధీ సందర్శించారు. లెర్నింగ్ టు లిసన్ ఇన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ అనే అంశంపై ఆయన మాట్లాడారు. ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. ట్రిమ్ చేసుకున్న గడ్డంతో కనిపించారు. ఈ మధ్య రెగ్యులర్ గా ధరిస్తున్న తెల్లటి టీ -షర్టుకు బదులుగా సూట్-టైలో కనిపిస్తూ అందంగా తయారయ్యారు. దీంతో రాహుల్ గాంధీ కొత్త లుక్‌కి సంబంధించిన ఫొటోలను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గత కొన్ని రోజుల క్రితమే భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ దాదాపు 4వేల కి.మీ. పాదయాత్ర చేశారు. గడ్డం గీసుకోకుండా, ఎముకలు కొరికే చలిలోనూ టీషర్టులోనే నడిచారు. దీని వెనుక ఉన్న కారణాన్ని కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు.  ఈ కార్యక్రమానికి భారత జాతీయ కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి స్వాగతం పలకడం ఆనందంగా ఉందని కేంబ్రిడ్జ్ JBS ట్వీట్ చేసింది.