
హాజీపూర్ బాధిత కుటుంబాలు ఇవాళ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలవనున్నాయి. తమ పిల్లలపై అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఉరితీయాలని కోరనున్నారు. హాజీపూర్ కు బ్రిడ్జి నిర్మించాలని, తమకు న్యాయం చేయాలని విన్నవించనున్నారు. ఘటనలు వెలుగులోకి వచ్చి ఆర్నెళ్లయినా.. నిందితుడికి శిక్ష పడకపోవటంపై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిశ ఎన్ కౌంటర్ తర్వాత తమ నిరసనలు తీవ్రం చేశారు. న్యాయం చేయాలంటూ ఆందోళనలు చేపట్టారు. ఇవాళ గవర్నర్ ను కలిసి తమకు న్యాయం చేయాలని కోరనున్నారు.