స్కాట్లాండ్​ ప్రధానిగా హంజా యూసఫ్.. ఇయ్యాల బాధ్యతల స్వీకరణ

స్కాట్లాండ్​ ప్రధానిగా హంజా యూసఫ్.. ఇయ్యాల బాధ్యతల స్వీకరణ

ఎడిన్​బర్గ్​: స్కాట్లాండ్​ ప్రధానమంత్రిగా పాకిస్తాన్​ మూలాలున్న 37 ఏళ్ల హంజా యూసఫ్​ ఎంపికయ్యారు. ప్రస్తుతం దేశ ప్రధానిగా ఉన్న నికోలా స్టుర గీవాన్​ స్థానంలో ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అధికార స్కాటిష్​ నేషనల్​ పార్టీ సభ్యులు హంజాను తమ ముఖ్యనేతగా మంగళవారం ఎన్నుకున్నారు. మొత్తం 72, 169 మంది పార్టీ సభ్యుల్లో దాదాపు 52 శాతం మంది హంజాకు ఓటువేశారు.   దీంతో ఆయనకు ప్రధాని పదవి దక్కడం ఖాయమైంది. స్కాట్లాండ్​ ప్రధాని పదవిని చేపట్టనున్న తొలి ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన నేతగానూ హంజా రికార్డుకెక్కారు.  మార్చి 29న ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.