
ఆత్మహత్యలు చేసుకున్న నేత కార్మికుల భార్యలు
ఢిల్లీలో కేసీఆర్ నివాసం ముట్టడి
హైదరాబాద్, వెలుగు: ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొన్న నేతన్నల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికుల భార్యలు ఢిల్లీలో శుక్రవారం ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ దాసు సురేశ్ ఆధ్వర్యంలో తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ నివాసాన్ని ముట్టడించి, టీఆర్ఎస్ సర్కారుకు, కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న వారందరినీ అరెస్టు చేసి మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తమ సమస్యలు పరిష్కరించి, ఆదుకునే వరకు ఢిల్లీలోనే ఉంటామని బాధిత మహిళలు స్పష్టం చేశారు. అరెస్ట్‌లకు భయపడేది లేదన్నారు. ఆదుకోవాలని కోరితే వితంతువులను అరెస్ట్ చేయడం సిగ్గుమాలిన చర్య అని నేతన్నల జేఏసీ చైర్మన్ దాసు సురేశ్ అన్నారు.