విజయవాడ కోర్టు సంచలన తీర్పు.. చిన్నారి హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష

విజయవాడ కోర్టు సంచలన తీర్పు.. చిన్నారి హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష

కృష్ణా జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఓ చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. విజయవాడలో నవంబర్ 10, 2019న పెంటయ్య అలియాస్ ప్రకాశ్ అనే వ్యక్తి ద్వారక అనే మైనర్ బాలికను కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత బాలికను హత్య చేశాడు. శవాన్ని తన ఇంట్లోనే బస్తాలో దాచిపెట్టాడు. ఈ కేసును విజయవాడ పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి కోర్టుకు నివేదికను అందించారు. ఆధారాలు పరిశీలించిన తర్వాత.. నిందితుడు నేరానికి పాల్పడినట్లు కోర్టు నిర్ధారణకు వచ్చింది. నేరం రుజువుకావడంతో పెంటయ్యకు న్యాయమూర్తి ఉరిశిక్ష విధించారు. గతంలో తోటి విద్యార్థినిని అతి కిరాతకంగా హత్య చేసిన మనోహర్ అనే యువకుడికి కూడా ఇదే కోర్టు ఉరిశిక్ష విధించింది.

For More News..

కరోనా కాలంలో అంబులెన్స్ దొంగతనం

రెస్టారెంట్ వినూత్న ప్రయోగం.. కోవిడ్ కర్రీ, మాస్క్ నాన్స్

ముంబైలో బతకడం సేఫ్ కాదు.. మాజీ సీఎం భార్య