122 సంవత్సరాల తర్వాత.. హన్మకొండలో భూమి బద్దలయ్యే రేంజ్లో వర్షం పడింది..!

122 సంవత్సరాల తర్వాత.. హన్మకొండలో భూమి బద్దలయ్యే రేంజ్లో వర్షం పడింది..!

ఒకటి రెండు రోజులపాటు కురిసిన వర్షం తెలుగు రాష్ట్రాలను ముంచేసినంత పనిచేసింది. ఏం కొట్టుడు.. ఏం దంచుడు.. తుఫాను దెబ్బకు గతంలో ఉన్న వర్షపాతం రికార్డులే బ్రేక్ అయ్యాయంటే ఎంతలా కురిసిందో ఊహించుకోండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. తెలంగాణలో మోస్తరు వర్షాలు కురవచ్చునని మొదట్లో అనుకున్నారు. కానీ వాయుగుండం తెలంగాణపైనే ఉన్నట్లుగా బుధవారం (అక్టోబర్ 29) వానలు దంచికొట్టాయి. తుఫాను ఎఫెక్ట్ తో నమోదైన వర్షపాతం హన్మకొండలో వందేళ్ల రికార్డులు తిరగరాసింది. 

 తెలంగాణలో కురిసిన వర్షాలు రికార్డులు నమోదు చేస్తున్నాయి. బుధవారం (అక్టోబర్ 29) హన్మకొండలో కురిసిన వర్షపాతం ఈ వందేళ్లలో ఎప్పుడూ ఇంతలా కురవలేదని వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం కురిసిన వర్షపాతం.. వందేళ్ల రికార్డును తిరగరాసిందని పేర్కొన్నారు. 

 అక్టోబర్ నెలలో ఎప్పుడూ ఇంత వర్షపాతం నమోదు అయినట్టు ఘనంకాలలో లేదని వాతావరణ కేంద్రం అధికారులు గురువారం (అక్టోబర్ 30) వెల్లడించారు. 100 సంవత్సరాల్లో  మొదటి సరిగా హన్మకొండ లో అత్యధికంగా వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. 12 నుంచి  15 గంటల్లోనే  39 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు చెప్పారు.

ఇంతటి భారీ వర్షం1903 సంవత్సరంలో నమోదైనట్లు తెలిపారు అధికారులో. ఆ ఏడాది  జులై నెలలో  22 సెంటీమీటర్ల వర్షపాతం హనుమకొండలో రికార్డ్ అయినట్టు ఘనాంకాలు ఉన్నట్లు చెప్పారు.  అక్టోబర్ నెలలో చూసుకున్నా 1995 లో  హనుమకొండలో  15 cm వర్షపాతం నమోదైంది.  గత పది సంవత్సరాలలో రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ నెలలో కురిసిన వర్షాలలో బుధవారం హనుమకొండలో పడినదే అత్యధిక వర్షపాతం అని చెబుతున్నారు. 

ఇక బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే.  రికార్డు స్థాయిలో పలు జిల్లాలో వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 14 చోట్ల అత్యంత భారీ (20cm పైగా) వర్షపాతం నమోదయింది.  అందులో  హనుమకొండ, జనగాం,  వరంగల్  జిల్లాల్లోనే 11 చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 

 రాష్ట్రంలో బుధవారం 30 చోట్ల అతిభారీ వర్షాలు కురిశాయి. 12  నుంచి 20 cm వరకు వర్షపాతం నమోదైంది.
మరో 46 చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. 7 నుంచి 12cm వరకు భారీ వర్షాలు కురిశాయి. 
123 చోట్ల  మోస్తారు వర్షపాతం పడింది. 2 to7 cm నమోదైనట్లు గణాంకాలు విడుదల చేశారు అధికారులు.