కొండగట్టు జాతరకు ఏర్పాట్లు చేయండి : హనుమంత రావు

కొండగట్టు జాతరకు ఏర్పాట్లు చేయండి : హనుమంత రావు
  • భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దు
  • అధికారులను ఆదేశించిన ఎండోమెంట్​ కమిషనర్

హైదరాబాద్, వెలుగు :  కొండగట్టు అంజన్న ఆలయంలో జూన్ 1న జరిగే హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించాలని దేవాదాయ కమిషనర్ హనుమంత రావు అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. సంబంధిత శాఖ అధికారులతో బుధవారం ఎండోమెంట్ కమిషనరేట్​లో రివ్యూ మీటింగ్ నిర్వహించి పలు సూచనలు చేశారు. హనుమాన్ జయంతి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు స్పెషల్ ఆఫీసర్లను నియమించినట్టు తెలిపారు. ‘‘ఎండోమెంట్ డిపార్ట్​మెంట్ డిప్యూటీ కమిషనర్లు రామకృష్ణ, వినోద్ రెడ్డి ఉత్సవాల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తారు.

 కొండగట్టు జాతరకు ప్రతి ఏటా లక్షలాది మంది హనుమాన్ భక్తులు వస్తుంటారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా టార్పాలిన్ కార్పెట్లు, మహిళలు, వృద్ధులు, పిల్లలకు ప్రత్యేక క్యూలైన్లు, తాగునీటి, విద్యుత్ సరఫరా, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలి. ప్రసాదం కౌంటర్ల వద్ద సిబ్బందిని నియమించాలి’’అని అన్నారు. మహారాష్ట్ర, చత్తీస్​గఢ్, ఏపీ నుంచి వేలాది మంది భక్తులు వస్తారని వివరించారు.