ఆగస్టు 1 నుండి 15 వరకు హర్ ఘర్ తిరంగ కార్యక్రమం

 ఆగస్టు 1 నుండి 15 వరకు హర్ ఘర్ తిరంగ కార్యక్రమం

ఒడిశాలో తిరంగ పాదయాత్ర నిర్వహించారు బీజేపీ నేతలు. పాదయాత్రలో పాల్గొన్నారు  యూనియన్ మినిస్టర్  ధర్మేంద్ర ప్రధాన్. అజాదీ కా అమృత్ మహోత్సవ్ లో  భాగంగా  తిరంగ పాదయాత్ర నిర్వహిస్తున్నారు బీజేపీ నేతలు. ఆగస్టు 1 నుంచి  15 వరకు  దేశ వ్యాప్తంగా  హర్ ఘర్ తిరంగ కార్యక్రమం జరగనుంది. ప్రతి ఇంటిపై  జాతీయ జెండా  ఎగుర వేయాలని కేంద్ర  ప్రభుత్వం నిర్ణయించింది.  దీంతో  హర్ ఘర్ తిరంగ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు బీజేపీ నేతలు. 

సోషల్ మీడియా అకౌంట్లకు డీపీలుగా జాతీయ జెండా: మోడీ పిలుపు

ఆగస్టు 2 నుంచి 15వ తేదీ వరకు భారతీయులంతా సోషల్ మీడియా అకౌంట్లకు డీపీలుగా జాతీయ జెండా పెట్టుకోవాలని పిలుపునిచ్చారుప్రధాని నరేంద్ర మోడీ.. మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన మోడీ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం ఓ సామూహిక ఉద్యమంగా మారడం చలా సంతోషంగా ఉందని మోడీ చెప్పారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన షహీద్ ఉధమ్ సింగ్ కు ఆయన నివాళులర్పించారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రత్యేక ఉద్యమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ మూడురోజులు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలన్నారు మోడీ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా చారిత్రాత్మక ఘట్టాన్ని చూడబోతున్నామన్నారు.