హీరో పేరుతో ఎఫ్‌బీలో అమ్మాయిలకు వేధింపులు

హీరో పేరుతో ఎఫ్‌బీలో అమ్మాయిలకు వేధింపులు

యువకుడిని అరెస్ట్​ చేసిన పోలీసులు

హైదరాబాద్(కూకట్​పల్లి), వెలుగు: ఫేస్​బుక్​లో నకిలీ ఖాతా తెరిచి, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ యువతులను వేధిస్తున్న ఓ యువకుడు చివరకు పోలీసులకు చిక్కి, జైలుపాలయ్యాడు. కూకట్​పల్లిలో ఉంటున్న వేణు(21) ఫేస్​బుక్​లో ఫేక్​ ఎకౌంట్​ ఓపెన్​చేశాడు. దానికి పూరీ ఆకాశ్‌‌ ఫొటో పెట్టి, అమ్మాయిలకు ఫ్రెండ్​ రిక్వెస్ట్​ పెట్టేవాడు. పూరీ ఆకాశేనని నమ్మిన యువతులతో మెసెంజర్​లో చాట్​చేస్తూ, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని మభ్యపెట్టేవాడు.

మెసెంజర్​లో అసభ్యకరమైన మెసేజ్​లు పంపిస్తూ వేధింపులకు గురిచేసేవాడు. వేణు బారిన పడిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కంప్లైంట్​తో పోలీసులు వేణును బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వేణు గదిలో నుంచి హార్డ్ డిస్క్​, పెన్​ డ్రైవ్​ను స్వాధీనం చేసుకున్నారు.