చాహల్‌కు లాలీపాప్‌ ఇచ్చి సరిపెట్టేశారు..ఇండియన్ సెలక్టర్లపై హర్భజన్ ఫైర్

చాహల్‌కు లాలీపాప్‌ ఇచ్చి సరిపెట్టేశారు..ఇండియన్ సెలక్టర్లపై హర్భజన్ ఫైర్

దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఇటీవలే టీమిండియా జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. మూడు ఫార్మాట్ లకు సంబంధించి ముగ్గురు కెప్టెన్లను ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. టెస్టు జట్టుకు రోహిత్ శర్మ, వన్డేలకు రాహుల్ లను ఎంపిక చేసిన సెలక్టర్లు..టీ20 లకు సూర్యను కెప్టెన్ గా కొనసాగించారు. కెప్టెన్ల విషయం పక్కనపెడితే కొంతమంది ఆటగాళ్లపై వేటు వేశారని.. ముఖ్యంగా చాహల్ ని టీ20 లకు ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యపరిచిందని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. 
     
చాహల్ మాట్లాడుతూ 'టీ20లలో యుజ్వేంద్ర చాహల్‌కు ఛాన్స్ ఇవ్వకుండా వన్డేలకు మాత్రం సెలెక్ట్ చేశారు. ఇదెలా ఉందంటే ఓ లాలీపాప్‌ను చాహల్ చేతికి ఇచ్చి ఊరించినట్లుగా ఉంది. చాహల్ ఎంత రాణించినా టీ 20 ఫార్మాట్ కు తీసుకోమని సెలెక్టర్లు చెప్పినట్లుగా ఉంది. మరో ఫార్మాట్లో ఛాన్స్ ఇస్తాం ప్రస్తుతం వన్డేలతో సరిపెట్టుకో అన్నట్లుగా సెలక్టర్ల తీరు ఉంది'. అని ఈ మాజీ స్పిన్నర్ తెలియజేశాడు. 

ఈ సందర్భంగా టెస్టులకు పక్కన పెట్టిన సీనియర్ బ్యాటర్లు పుజారా, రహానేల గురించి మాట్లాడాడు సౌతాఫ్రికా టూర్ చాలా సవాళ్లతోఉంటుందని.. యంగ్ ప్లేయర్లకు ఛాన్స్ ఇవ్వటం మంచిదే అయినా వాళ్లు తట్టుకోగలరా అనేదే ప్రశ్న.. అంటూ హర్భజన్ సింగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కాగా.. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబర్ 10 నుంచి టీ20లతో ఈ టూర్ ప్రారంభమవుతుంది.