ఆయన డిఫరెంట్ గేమ్స్ ఆడేవాడు: హర్భజన్

ఆయన డిఫరెంట్ గేమ్స్ ఆడేవాడు: హర్భజన్

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెట్ జర్నీలో గ్రెగ్ చాపెల్ కోచ్ గా ఉన్న టైమ్ ను గడ్డుకాలంగా విశ్లేషకులు చెప్తుంటారు. బెంగాల్ టైగర్ గంగూలీ ఏరికోరి చాపెల్ ను కోచ్ గా తెచ్చుకోగా.. చాపెల్ కారణంగా కెప్టెన్ పదవితోపాటు గంగూలీకి జట్టులో చోటు లేకుండా పోయింది. అలాగే అద్భుతంగా రాణిస్తున్న ఇర్ఫాన్ పఠాన్ లాంటి స్వింగ్ బౌలర్ ను ఆల్ రౌండర్ చేయాలనే పట్టుదలతో అతడి బౌలింగ్ లయ కూడా దెబ్బతినేలా చేశాడని చాపెల్ పై క్రిటిక్స్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంటారు. తాజాగా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా చాపెల్ పై కామెంట్ చేశాడు.

ఈమధ్య ఫేస్ బుక్ హ్యాండిల్ లో చాపెల్ ధోనీని ప్రశంసించాడు. తాను చూసిన పవర్ హిట్టర్లలో ధోని బెస్ట్ అని చాపెల్ పొగిడాడు. శ్రీలంకపై 183 రన్స్ ఇన్నింగ్స్ ఆడాక నెక్స్ట్ మ్యాచ్ గురించి ధోనితో మాట్లాడానని చాపెల్ చెప్పాడు. ‘ప్రతి బాల్ ను బౌండరీకి తరలించడం బదులు.. నువ్వు గ్రౌండ్ షాట్స్ ఎందుకు ఆడవు’ అని ధోనీకి తాను సలహా ఇచ్చినట్టు గ్రెగ్ పేర్కొన్నాడు. దీనిపై భజ్జీ తాజాగా కామెంట్ చేశాడు. ‘ఆయన (చాపెల్ ను ఉద్దేశించి) ధోనీని గ్రౌండ్ షాట్స్ కొట్టమని చెప్పాడు. ఎందుకంటే ఆయన అందరినీ పార్క్ నుంచి బయటకు కొట్టేవాడు.. ఆయన డిఫరెంట్ గేమ్స్ ఆడేవాడు’ అని భజ్జీ విమర్శించాడు. గ్రెగ్ చాపెల్ ఆధ్వర్యంలో ఇండియన్ క్రికెట్ లో వర్స్ట్ డేస్ అనే హ్యాష్ టాగ్ ను భజ్జీ తన పోస్ట్ కు జత చేశాడు.