టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఏం చేసినా అతని స్టయిలే వేరు. సహచర ప్లేయర్లకు భిన్నంగా ప్రవర్తిస్తూ తనదైన మార్క్ చూపిస్తాడు. ప్రస్తుతం అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా హార్దిక్ చేసిన ఒక పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంగళవారం (డిసెంబర్ 2) హైదరాబాద్ వేదికగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో పంజాబ్, బరోడా మధ్య మ్యాచ్ జరిగింది. రెండు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉండడంతో ఈ మ్యాచ్ చూడడానికి ఫ్యాన్స్ ఎక్కువ మంది వచ్చారు.
దాదాపు మూడు నెలల తర్వాత టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య క్రికెట్ లో అడుగుపెట్టాడు. పాండ్య ఆట చూడడానికి అభిమానాలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పాండ్య బౌలింగ్ చేస్తున్నప్పుడు ఒక అభిమాని సెక్యూరిటీని దాటుకొని గ్రౌండ్ లోకి వచ్చాడు. సెక్యూరిటీ అతడిని చూసి వేగంగా గ్రౌండ్ లోకి వచ్చారు. ఆ యువ అభిమానిని గ్రౌండ్ లో నుంచి బయటకు పంపే ప్రయత్నం చేశారు. ఈ దశలో హార్దిక్ పాండ్య తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. సెక్యూరిటీని ఆపి మరీ అభిమానికి సెల్ఫీ ఇచ్చి హైలెట్ గా మారాడు. సెల్ఫీ తీసుకున్న తర్వాత ఆ అభిమాని సంతోషంగా గ్రౌండ్ లో నుంచి వెళ్ళిపోయాడు.
ఈ మ్యాచ్ లో పాండ్య బౌలింగ్ లో ఘోరంగా విఫలమయ్యాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 52 పరుగులు సమర్పించుకున్నాడు. సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ ముందు పాండ్య పేలవ ఫామ్ ఆందోళనకు గురి చేస్తోంది. బౌలింగ్ లో విఫలమైన బ్యాటింగ్ లో అదరగొట్టాడు. నాలుగో స్థానంలో బరిలోకి దిగి 42 బంతుల్లోనే 77 పరుగులు చేశాడు. పాండ్య ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి. ఈ మ్యాచ్ విషయానికి వస్తే పాండ్య బ్యాటింగ్ లో దుమ్ములేపడంతో బరోడా 223 పరుగుల లక్ష్యాన్ని మరో ఐడి బంతుల్లో ఉండగానే ఛేజ్ చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Hyderabad is OFF the charts for Hardik Pandya! 🤯 During SMAT, a fan literally broke all barriers to touch his feet 🙌 The love & respect for #HardikPandya is next level! 🔥🔥
— The sports (@the_sports_x) December 2, 2025
pic.twitter.com/WybnphXKWt
